

భారత్, అమెరికాకు విశ్వసనీయ మిత్రదేశమని అమెరికా సెనెటర్ స్టీవ్ డైన్స్ తెలిపారు. భారత్–అమెరికా మధ్య ఉన్న బలమైన సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికీ మేలు చేస్తాయని పేర్కొన్నారు. భారత్, చైనా భద్రతా పరిస్థితులను పోల్చుతూ, తాను చైనాకు వెళ్లేటప్పుడు భద్రతా కారణాల వల్ల మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలి వెళ్తానని చెప్పారు. అయితే భారత్‌కు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా ఫోన్‌ను వెంట తీసుకువస్తానని, బీజింగ్ కంటే న్యూఢిల్లీపై ఎక్కువ నమ్మకం ఉందని వెల్లడించారు.
చైనాతో, అమెరికా పూర్తిగా సంబంధాలు తెంచుకోదని, కానీ వ్యూహాత్మక ప్రమాదాలను తగ్గించుకుంటూ సంబంధాలను కొనసాగిస్తుందని స్టీవ్ డైన్స్ స్పష్టం చేశారు. భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశముందని, ఆ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!