

ఈరోజు 16న మధ్యాహ్నం 3 గంటలలోపు మౌలాలి రైల్వే ఎల్‌సీ గేట్ నంబర్ 6 సమీపంలోని అప్‌లైన్ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. జనగాం నుంచి తల్లిదండ్రులతో కలిసి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో మౌలాలి చేరుకున్న 20 ఏళ్ల మానస.. ప్లాట్‌ఫామ్ నంబర్ 2 నుంచి 1వ ప్లాట్‌ఫామ్ వైపు వెళ్లే క్రమంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానస పట్టాలు దాటడానికి కారణమేంటి, రైలు వస్తున్న విషయాన్ని గమనించిందా, ప్రమాదానికి ముందు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది. వృత్తిరీత్యా నర్స్‌గా పనిచేస్తున్న మానస.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించే వృత్తిని ఎంచుకుంది. తల్లిదండ్రులతో కలిసి చేసిన సాధారణ రైలు ప్రయాణం విషాదాంతం కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!