
బిజినెస్

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ సంఖ్యలో CJP కార్యకర్తలు చేరుకుని కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు నిరసనలు ఆగవని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో జంతర్‌మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో విద్యార్థులు, నిరసనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు పూర్తిగా దిగ్బంధం చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు CRPF, RAFతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలను భారీగా మోహరించారు. నిరసనలు మరింత విస్తరించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!