

బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌లో వరుసగా కంటెస్టెంట్ల ఎంట్రీలు మొదలయ్యాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి దేబ్జానీ మోదక్ మొదటి సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం ఇటీవల తన పేరును ఆదిత్ అరుణ్ నుంచి త్రిగుణ్‌గా మార్చుకున్న హీరో త్రిగుణ్ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ‘అగ్నిపరీక్ష 2’లో టికెట్ గెలుచుకున్న కామనర్లలో ముందుగా ఝాన్సీ.. ఈ సీజన్లో హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి కామనర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ‘అగ్నిపరీక్ష 2’కు మంచి స్పందన లభించిందని నాగార్జున తెలిపారు.
ఆ తర్వాత డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా పర్సనాలిటీ సుధీర్ రెడ్డి నాలుగో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఏవీని ప్రదర్శించిన సుధీర్.. తన వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుష్క శెట్టి తన బిగ్గెస్ట్ క్రష్ అని వెల్లడించారు. ఇలా తొలి నలుగురు కంటెస్టెంట్ల ఎంట్రీతో బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్ మరింత ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!