

భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన చైనా మాస్టర్స్ ఫైనల్లో భారత జోడీ తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. షెన్‌జెన్ అరేనాలో జరిగిన తుది పోరులో చైనాకు చెందిన హీ జీ టింగ్, రెన్ జియాంగ్ యూను 11-21, 21-13, 21-17తో ఓడించింది. తొలి గేమ్‌లో వెనుకబడిన సాత్విక్-చిరాగ్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు.
2023, 2025లో చైనా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్-చిరాగ్‌కు ఇది మూడో ఫైనల్. నిర్ణాయక మూడో గేమ్‌లో 16-17తో వెనుకబడిన సమయంలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 1 గంట 10 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో 2026 సీజన్‌లో వీరిద్దరికీ రెండో BWF వరల్డ్ టూర్ సూపర్ 750 టైటిల్ దక్కింది. మేలో సింగపూర్ ఓపెన్‌ను కూడా గెలిచిన ఈ జోడీ.. ఈ నెలలో జరగనున్న ఆసియా క్రీడల్లో టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!