

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా కొత్త పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర అర్హత కలిగిన వర్గాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణతో పాటు eKYC ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
దరఖాస్తుదారులు రైస్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ వంటి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్, వితంతువులు భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, అనంతరం అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ పొందాలి.
దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. అర్హతలు, పత్రాలను పరిశీలించిన అనంతరం కొత్త పింఛన్లను మంజూరు చేస్తారు.
గమనిక: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు స్థానిక సచివాలయంలో తాజా అర్హత నిబంధనలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు షెడ్యూల్‌పై అధికారికంగా నిర్ధారించుకోవడం మంచిది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!