

హైదరాబాద్‌లో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. గదిలోకి వెళ్లిన ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా.. మాధురి అపస్మారక స్థితిలో కనిపించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను కాపాడి వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తన ఫిర్యాదుకు సంబంధించి పోలీసుల తీరుపై మాధురి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈశ్వర్ సాయి అనే వ్యక్తిపై తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు అతడిపై చర్యలు తీసుకోలేదని, అరెస్టు చేయలేదని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈశ్వర్ సాయిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!