6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

Writer: Harika S 10:12 PM, 6 సెప్టెంబర్, 2026
తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు మరోసారి ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ తెలంగాణ రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని కేసీఆర్ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద అవసరమైన మరమ్మతులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకువస్తే అనేక జిల్లాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగిస్తే పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయకులతో చర్చించి లక్షలాది మందితో ప్రత్యక్ష కార్యాచరణ చేపడతానని కేసీఆర్ ప్రకటించారు.

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి అంశాలను బలంగా ప్రస్తావించాలని కేసీఆర్ సూచించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న భూముల సమస్యలు, 22ఏ నిషేధిత జాబితా, సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ, విద్యారంగం, గురుకులాలు, మహిళల భద్రత, శాంతిభద్రతలు, విద్యుత్ విధానాలు, రైతులకు ఉచిత విద్యుత్, ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ వంటి అంశాలను కూడా సభల్లో ప్రస్తావించాలని కేసీఆర్ తెలిపారు. ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ, సింగరేణి, హైదరాబాద్ మెట్రో రైలు, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం పెరిగాయని కేసీఆర్ ఆరోపించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ, మండలిలో బలంగా వినిపించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బండ ప్రకాష్, మధుసూదనాచారి, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
ట్యాగ్లు
కేసీఆర్బీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలుసాగునీటి ప్రాజెక్టులుకాళేశ్వరం ప్రాజెక్టుపాలమూరు రంగారెడ్డిజల యుద్ధంతెలంగాణ అసెంబ్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించిన సీఎస్‌ సంజయ్‌ జాజు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
జనరల్

ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
జనరల్

ఢిల్లీ భవనం కూలిన ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బిగ్ బాస్ సీజన్ 10: గ్రాండ్‌గా కంటెస్టెంట్ల ఎంట్రీ.. 16 మంది లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ సీజన్ 10: గ్రాండ్‌గా కంటెస్టెంట్ల ఎంట్రీ.. 16 మంది లిస్ట్ ఇదే

డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఈ పీసీఓఎస్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ
జనరల్

ట్రాన్స్‌జెండర్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్
జనరల్

తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో ‘జల యుద్ధానికి’ సిద్ధం కావాలి: కేసీఆర్

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
జనరల్

నర్సు హత్య ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..
సినిమాలు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..
సినిమాలు

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!