

పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది హార్మోన్లతో పాటు జీవక్రియపై కూడా ప్రభావం చూపే సమస్య. పీరియడ్స్ క్రమం తప్పడం, తగ్గని మొటిమలు, జుట్టు పలచబడటం లేదా రాలిపోవడం, బరువు నియంత్రించడంలో ఇబ్బంది, మూడ్ మార్పులు, ఆందోళన వంటి లక్షణాలు కనిపించవచ్చు. మెడ వెనుక లేదా చంకల్లో చర్మం నల్లగా, మందంగా మారడం కూడా ఇన్సులిన్ నిరోధకతకు సంబంధించిన సంకేతంగా ఉండొచ్చు. అయితే ఒక్క లక్షణాన్ని బట్టి PCOS ఉందని నిర్ధారించలేం.
పీసీఓఎస్‌ను అనుమానించే లక్షణాలు నిరంతరం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వైద్య చరిత్ర, శారీరక పరీక్షలతో పాటు హార్మోన్లు, రక్తంలో చక్కెర వంటి అంశాలను అంచనా వేసేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి పెల్విక్ అల్ట్రాసౌండ్ కూడా చేయవచ్చు. వ్యక్తిగత పరిస్థితిని బట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, హార్మోన్ల లేదా జీవక్రియ సంబంధిత చికిత్స, గర్భధారణ కోసం సంతాన సాఫల్య చికిత్సలు సూచించవచ్చు. PCOS ఉన్నవారిలో టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి జీవక్రియ సమస్యల ముప్పు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: PCOS లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండవు. పై లక్షణాలు ఉన్నంత మాత్రాన PCOS ఉన్నట్లు నిర్ధారించలేం. సరైన నిర్ధారణ కోసం వైద్యుల సలహా తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా మందులు వాడకండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!