
జనరల్

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌క్వా ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలోచిస్థాన్ సరిహద్దు సమీపంలోని డాన్ సార్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మరో బస్సు బ్రేక్‌డౌన్ కావడంతో అందులోని అదనపు ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించారు. దీంతో బస్సులో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!