
రాజకీయాలు

బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ చిక్కుల్లో పడ్డారు. విమల్ ఎలకాయ్ ప్రకటనలో నటించిన ఈ ముగ్గురికి మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మహారాష్ట్రలో నిషేధితమైన విమల్ పాన్ మసాలాకు పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
ప్రకటనలో తమ పాత్ర ఏమిటో, ఈ ప్రచారంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని FDA ముగ్గురు నటులను కోరింది. నోటీసులు అందిన 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. అలాగే సోషల్ మీడియాలో ఉన్న సంబంధిత ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని FDA హెచ్చరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!