

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మూడు శాతానికి పైగా తగ్గినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. గత సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా బాలికలు అత్యుత్తమ ఫలితాలు సాధించి బాలుర కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారు.
అధికారిక గణాంకాల ప్రకారం బాలికల ఉత్తీర్ణత శాతం 88.86గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.13గా నమోదైంది. మొత్తం 94,028 మంది విద్యార్థులు 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించగా, 17,113 మంది 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు. మరోవైపు ‘కంపార్ట్మెంట్’ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025లో 1,29,095 మంది విద్యార్థులు కంపార్ట్మెంట్లో ఉండగా, ఈసారి ఆ సంఖ్య 1,63,800కు పెరిగింది. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్ట్మెంట్ కేటగిరీలో పరిగణిస్తారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!