

కెవిఎన్ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న జననాయకన్ లో విజయ్, టాక్సిక్ లో యశ్ నటిస్తున్నారు. వివిధ కారణాలతో ఈ రెండు ప్రాజెక్టులు ఆలస్యమైనప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో వీటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రాజకీయ విజయానంతరం జన నాయకన్ సినిమాకు వ్యాపార పరంగా డిమాండ్ మరింత పెరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ రెండు చిత్రాల డిజిటల్ హక్కుల విక్రయానికి కెవిఎన్ ప్రొడక్షన్స్ పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. రెండు సినిమాలను ఒకే ప్లాట్‌ఫామ్‌కు ప్యాకేజీ డీల్ రూపంలో విక్రయించి రికార్డు స్థాయి ధర దక్కించుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అమెజాన్ప్రైమ్వీడియో తో చర్చలు కొనసాగుతున్నాయి. గతంలో టాక్సిక్ చిత్రానికి కోరిన భారీ ధరను ఓటీటీ సంస్థలు తిరస్కరించినప్పటికీ, ఇప్పుడు రెండు సినిమాలను కలిపి విక్రయించడం ద్వారా డీల్‌ను త్వరగా పూర్తి చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!