

పెద్ది తో రామ్‌చరణ్ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బుచ్చిబాబుసనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మే 18న ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాపై ఉన్న హైప్ కారణంగా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో ఈ చిత్రానికి సమతుల్య టికెట్ ధరల వ్యూహాన్ని అమలు చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 3 సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించే అవకాశముండగా, ఆ షోల టికెట్ ధరలు సుమారు రూ.600 ఉండొచ్చని సమాచారం. రెగ్యులర్ షోల విషయంలో సాధారణ టికెట్ ధరలపై రూ.100 వరకు మాత్రమే పెంపు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల భారీ సినిమాలతో పోలిస్తే ఇది ప్రేక్షకులకు అనుకూలమైన నిర్ణయంగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమా కంటెంట్ ఆకట్టుకుంటే, బలమైన హైప్‌తో పాటు నియంత్రిత టికెట్ ధరలు బాక్సాఫీస్ వద్ద అద్భుత ఫలితాలు ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!