

జస్‌ప్రీత్‌బుమ్రా ప్రపంచ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 879 పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 838 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 836 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. బుమ్రా తన అద్భుత ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ పేసర్లలో ఒకరిగా మరోసారి నిరూపించుకున్నాడు.
భారత బౌలర్లలో మహ్మద్‌సిరాజ్ 707 పాయింట్లతో 12వ స్థానంలో ఉండగా, రవీంద్రజడేజా 14వ, కుల్దీప్ యాదవ్ 15వ ర్యాంకుల్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో యశస్విజైశ్వాల్ 8వ స్థానంలో కొనసాగుతుండగా, శుభ్‌మన్‌గిల్ 9వ, రిషభ్‌పంత్ 14వ స్థానాల్లో నిలిచారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!