

ఉత్తరప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు, గాలివానల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 60 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఫతేపూర్, దేహత్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
ఐఎండి రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వాటిని పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!