
జనరల్

ఎన్‌రంగస్వామి కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. రాజ్ నివాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కే కైలాసనాథన్ ఆయనతో పాటు నూతన మంత్రులతో పదవీ ప్రమాణం చేయించారు. రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రితో పాటు బీజేపీ ఎమ్మెల్యే నమశ్శివాయం, ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాదికృష్ణారావు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవిని ఐదుసార్లు చేపట్టిన తొలి నాయకుడిగా రంగస్వామి రికార్డు నెలకొల్పారు. ఆయన రాజకీయ అనుభవం, ప్రజాదరణే ఈ విజయానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!