

తమిళనాడులో చారిత్రాత్మక విజయంతో అధికారంలోకి వచ్చిన జోసెఫ్‌విజయ్ తన ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు. తమిళ రాజకీయాల్లో ద్రవిడ సంస్కృతికి ప్రతీకగా భావించే ధోతీ, కుర్తా సంప్రదాయాన్ని పక్కనపెట్టి, ఆధునిక బ్లేజర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కొత్త చర్చకు తెరతీశారు. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, ఎంకే స్టాలిన్ వంటి నేతలు సంప్రదాయ వస్త్రధారణలో బాధ్యతలు చేపట్టగా, విజయ్ మాత్రం జెన్ జీ తరహా మోడ్రన్ స్టైల్‌ను ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినట్టుగానే తాను సామాన్యుడినే అన్న సందేశాన్ని విజయ్ మరోసారి తన ఆహార్యంతో ప్రజలకు చేరవేశారు. తమిళగ వెట్రి కజగం అధినేతగా యువతను ఆకర్షించేలా ఆధునిక రాజకీయ శైలిని ప్రదర్శించిన ఆయన, ప్రమాణస్వీకారం నుంచే మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్లేజర్‌ను ధరించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎంజీఆర్ తర్వాత రాజకీయ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి సినీనటుడిగా విజయ్ చరిత్ర సృష్టించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!