
సినిమాలు

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ పక్షుల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పచ్చని పొలాల్లో సంచరించే నెమళ్లు ఒక్కసారిగా మృతిచెందడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 44 నెమళ్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం.
ల్యాబ్ పరీక్షల్లో ఈ మరణాలకు హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమై పర్యవేక్షణ చర్యలు పెంచారు. పక్షుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!