

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు. భారతీయ వినియోగదారుల నుంచి వ్యక్తిగత యూపీఐ లావాదేవీలకు ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని తెలిపారు.
లోక్‌సభలో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. అయితే వ్యక్తులు కుటుంబ సభ్యులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలకు చేసే వ్యక్తిగత యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు వర్తించవని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. భారీ వార్షిక టర్నోవర్ కలిగిన షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్లలో రూ.2,000కు మించిన కొన్ని చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు విధించే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ వినియోగదారుల వ్యక్తిగత లావాదేవీలకు రుసుములు ఉండవని స్పష్టమైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!