
సినిమాలు

వైసీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. బస్టాండ్లు, ప్రధాన రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిరసనలు చేపడితే అంగీకరించబోమని హెచ్చరించారు. నిరసనల పేరుతో ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలకు ప్రభుత్వం అనుమతించదని తెలిపారు.
వైసీపీ రిలే దీక్షల్లో డీఎస్సీ అభ్యర్థులు ఎవరూ లేరని చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో నిరసన చేపట్టిన వారిలో ఎక్కువ మంది ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల జరిగిన నష్టంతోనే ఉపాధ్యాయులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!