

హర్షవర్ధన్ రాణే, సంజీదా షేక్‌ల మధ్య డేటింగ్ రూమర్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను నేరుగా పంచుకోకపోయినా, తాజాగా వారు పోస్ట్ చేసిన ట్రావెల్ ఫొటోల్లో ఒకే తరహా లొకేషన్, వంటగది సెటప్, పరిసరాలు కనిపించడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. హర్షవర్ధన్ రాణే ఓ ప్రశాంతమైన ఏర్‌బీఎన్‌బీ ప్రాపర్టీలో టీ తయారు చేస్తూ, గుడ్లు ఉడకబెడుతున్న ఫొటోలను పంచుకోగా, అదే సమయంలో సంజీదా షేక్ కూడా టీ తాగుతూ, ఆమ్లెట్ తయారు చేస్తున్న దృశ్యాలను షేర్ చేశారు.
రెండు ఫొటోల్లోని స్టవ్, ఫర్నిచర్, బ్యాక్‌గ్రౌండ్, పచ్చదనం దాదాపు ఒకేలా కనిపించడంతో ఇద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారా? అనే చర్చ మొదలైంది. అభిమానులు, నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం వారు స్నేహితులతో కలిసి వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. అయితే, హర్షవర్ధన్ రాణే, సంజీదా షేక్ తమ సంబంధంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!