
సినిమాలు

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 9న ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేసి, తనకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చనున్నారు.
ఈ సందర్భంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి కేసీఆర్ ధైర్యం చెప్పి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులను కలిసి వారిలో మనోధైర్యం నింపనున్నారు. ఇప్పటికే పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!