
సినిమాలు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు ఉన్నట్లు భావిస్తున్న ఐఫోన్ కనిపించకుండా పోవడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. కస్టడీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి, తాను మద్యం మత్తులో సూసైడ్ నోట్ రాసినట్లు వెల్లడించినట్లు సమాచారం. అయితే ఆ నోట్ ప్రస్తుతం ఎక్కడ ఉందో తనకు తెలియదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
సూసైడ్ నోట్‌కు సంబంధించిన అంశాలపై సీపీ సజ్జనార్ ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు, సూసైడ్ నోట్‌తో పాటు ఇతర కీలక ఆధారాలు ఉన్న ఐఫోన్ మాయం కావడంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఆచూకీ, అందులో ఉన్న సమాచారం, సూసైడ్ నోట్‌కు సంబంధించిన వివరాలను వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!