

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆయన కెరీర్‌లో 31వ సినిమాగా రూపొందుతోంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ మూవీని పక్కా కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, కార్తి సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తొలుత నయనతార, త్రిష పేర్లు వినిపించగా, తాజాగా త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత కార్తి, త్రిష జోడీ మరోసారి తెరపై కనిపించనుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించనున్నట్లు సమాచారం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!