

విజయ డెయిరీ పాల ధరలను ఆగస్టు 10 నుంచి లీటరుకు రూ.2 పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లోని విజయ డెయిరీ వద్ద ధర్నా నిర్వహించింది. నాలుగు నెలల్లోనే మరోసారి పాల ధరలు పెంచడం సామాన్యులపై అదనపు భారం మోపుతుందని సీపీఎం నేతలు విమర్శించారు. పిల్లలు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు, పార్టీ నేతలు మాట్లాడుతూ.. విజయ డెయిరీ, కృష్ణా మిల్క్ యూనియన్‌లో ప్రభుత్వ జోక్యాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని, పెంచిన పాల ధరలను వెంటనే రద్దు చేయాలని కోరారు. హెరిటేజ్, ప్రైవేటు డెయిరీల ప్రయోజనాల కోసం సహకార సంస్థలను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలను వారు చేశారు. పాల ధరలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!