

భారత్లో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే 24 క్యారెట్ బంగారం సుమారు రూ.11 వేల మేర పెరిగినప్పటికి, వెండి ధర ఏకంగా రూ.30 వేల వరకు ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేడు ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.11,770 పెరిగి రూ.1,78,850 కు చేరింది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10,800 పెరుగుతూ రూ.1,63,950 వద్ద ఉంది. వెండి ధర కూడా భారీగా ఎగసి, ట్రేడింగ్ ప్రారంభంలోనే సుమారు రూ.30,000 పెరిగి రూ.4,10,000 కు చేరింది.
నగరాల వారీగా చూస్తే, హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850 గా ఉంది, ఢిల్లీలో అత్యధికంగా రూ.1,79,000 కు ఎగబాకింది. హైదరాబాద్లో 22 క్యారెట్ బంగారం ధర రూ.1,63,950 గా ఉండగా, ఢిల్లీలో రూ.1,64,100 వద్ద ఉంది. వెండి ధరల్లో కూడా ఎగసుకలుపు కనిపిస్తుంది. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి రూ.4,25,000 కు చేరగా, ఢిల్లీలో మరియు ముంబైలో రూ.4,10,000 వద్ద స్థిరపడింది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు ముందు తాజా ధరలను తప్పనిసరిగా తనిఖీ చేయడం అవసరం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!