

ఈరోజు ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,790, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,890గా నమోదైంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.
మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.100 తగ్గి రూ.2,34,900కు చేరుకుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450తో అత్యధికంగా ఉండగా, ఢిల్లీలో రూ.1,42,940గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ మారకం విలువ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతున్న నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు తాజా ధరలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!