
జనరల్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల వరకు ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 16% అధికం. కార్పొరేట్ పన్ను వసూళ్లు 22% పెరిగి రూ.2.40 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను, హిందూ అవిభక్త కుటుంబాల నుంచి వచ్చిన వసూళ్లు 12% పెరిగి రూ.3.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సెక్యూరిటీల లావాదేవీల పన్ను 48% వృద్ధితో రూ.26,429 కోట్లకు చేరింది.
స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16.11% వృద్ధితో రూ.7.73 లక్షల కోట్లకు చేరగా, ఇందులో కార్పొరేట్ పన్ను వాటా రూ.3.35 లక్షల కోట్లు. రిఫండ్‌లు కూడా 14.57% పెరిగి రూ.1.22 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.26.97 లక్షల కోట్ల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది, ఇది గత ఏడాది కంటే 15% అధికం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!