

బంగారం, వెండి ధరల్లో మరోసారి భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత సెషన్‌లోనే విలువైన లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1,400 పెరగగా, కిలో వెండి ధర రూ.4,000 మేర ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం బంగారం, వెండి ధరలకు మద్దతుగా నిలిచాయి. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది.
తాజా ధరల ప్రకారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,610 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,560గా ఉంది. విజయవాడ, ముంబై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,760, 22 క్యారెట్ల ధర రూ.1,32,710గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,43,550, 22 క్యారెట్ల ధర రూ.1,31,580గా నమోదైంది. ఇక కిలో వెండి ధర రూ.2,04,900 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, ముడి చమురు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణ భయాలను కొంత తగ్గించి, వడ్డీ రేట్లపై అంచనాలను ప్రభావితం చేస్తుంది. అధిక వడ్డీ రేట్ల వాతావరణంలో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలుదారులు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ దుకాణాల్లో తాజా ధరలను మరోసారి నిర్ధారించుకోవాలి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!