

హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసం నవంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. దీపావళితో ఆశ్వయుజ మాసం ముగియడంతో మంగళవారం నుంచి కార్తీక మాసం ఆరంభం కానుంది. ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు. మాఘ మాసంలో సూర్యభగవానుడిని, శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవిని, కార్తీక మాసంలో పరమశివుడిని, మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం సంప్రదాయం. 2026 నవంబర్ 10న ప్రారంభమయ్యే కార్తీక మాసం డిసెంబర్ 8తో ముగియనుంది. ఈ నెలలో భక్తులు దీపారాధన, ఉపవాసాలు, శివాలయ దర్శనాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కార్తీక మాసంలో పలు పర్వదినాలు, విశేష పూజలు జరగనున్నాయి. నవంబర్ 13న నాగుల చవితి, నవంబర్ 14న నాగ పంచమి, నవంబర్ 16న తొలి కార్తీక సోమవారం, నవంబర్ 21న క్షీరాబ్ది ద్వాదశి, నవంబర్ 23న రెండో కార్తీక సోమవారం, నవంబర్ 24న కార్తీక పౌర్ణమి, నవంబర్ 30న మూడో కార్తీక సోమవారం నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న నాలుగో కార్తీక సోమవారం, మాస శివరాత్రి పర్వదినాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!