

ఎయిర్‌టెల్ తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక ‘Buy 1 Get 1 Free’ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349, రూ.399 రీఛార్జ్ ప్లాన్లపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా అర్హత కలిగిన వినియోగదారులు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే, అదే ప్లాన్ ప్రయోజనాలను మరోసారి అదనంగా ఉచితంగా పొందవచ్చు. రెండోసారి రీఛార్జ్ చేయకుండానే ఎక్కువ రోజుల పాటు సేవలను వినియోగించుకునే అవకాశం ఈ ఆఫర్ ద్వారా లభిస్తుంది.
రూ.349 ప్లాన్‌పై సాధారణంగా లభించే 28 రోజుల వ్యాలిడిటీకి బదులుగా మొత్తం 56 రోజుల పాటు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. ఇక రూ.399 ప్లాన్‌పై 56 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ వినియోగదారులందరికీ వర్తించదు. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో ‘1+1 Recharge Free’ అనే ట్యాగ్ కనిపించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. రీఛార్జ్ చేసుకునే ముందు తమ ఖాతాలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో యాప్‌లో తనిఖీ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!