

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రూ.10,000 ధరతో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌కు ఏకంగా మూడేళ్ల (1,095 రోజులు) వ్యాలిడిటీ ఉంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు అపరిమిత 5జీ డేటా, రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. సాధారణంగా టెలికాం సంస్థలు నెలవారీ, వార్షిక ప్లాన్‌లను అందిస్తుండగా.. జియో మూడేళ్ల వ్యాలిడిటీతో ప్లాన్ తీసుకురావడం విశేషం.
కనెక్టివిటీ ప్రయోజనాలతో పాటు ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, 12 నెలల పాటు కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. అలాగే ఫొటోలు, డాక్యుమెంట్లను భద్రపరుచుకునేందుకు 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజీని అందిస్తోంది. ఈ ప్లాన్ నవంబర్ 7 నుంచి మై జియో యాప్, అధికారిక వెబ్‌సైట్, జియో స్టోర్లు, ఇతర రిటైల్ ఔట్‌లెట్లలో అందుబాటులోకి రానుంది. రోజుకు సుమారు రూ.9.13 ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోరుకునేవారికి ఇది ఉపయోగకరమైన ఎంపికగా నిలవనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!