6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

Writer: Chandrika 04:51 PM, 6 నవంబర్, 2026
ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో పికో టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పికో వ్యవస్థాపకుడు, సీఈఓ జారోడ్‌ యస్టర్‌, ఏఐసీఓకు చెందిన జి. సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తూ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్లోబల్‌ సమ్మిట్‌ విధానాన్ని తీసుకొచ్చామని, రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు ఇది కీలక వేదికగా నిలుస్తుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో తెలంగాణను పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికతకు అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పికో టెక్నాలజీ ఇండియా హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొస్తుందని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్‌ కార్యక్రమంగా ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీటిలో దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

ట్యాగ్లు
తెలంగాణశ్రీధర్‌బాబుకోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిరేవంత్‌రెడ్డిపికో టెక్నాలజీ ఇండియాహైదరాబాద్‌గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ఇన్వెస్ట్‌ తెలంగాణఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌సాంకేతిక పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..
టెక్నాలజీ

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా
జనరల్

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..
టెక్నాలజీ

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
జనరల్

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?
జనరల్

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ కార్యకర్తలు
రాజకీయాలు

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..
జనరల్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..
బిజినెస్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!