
రాజకీయాలు

యూపీఎస్సీ, పంజాబ్ సివిల్ సర్వీసెస్ (పీసీఎస్) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పంజాబ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్థికంగా వెనుకబడిన 1,000 మంది విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు సివిల్స్ కలను వదులుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ పథకం కింద ప్రభుత్వ కళాశాలల నుంచి 750 మంది, ప్రైవేట్ కళాశాలల నుంచి 250 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి ఆన్‌లైన్ లైవ్ క్లాసులు, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్‌లతో పాటు ఇంటర్వ్యూలకు అవసరమైన ప్రత్యేక మార్గదర్శకత్వం అందించనున్నారు. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక అడ్డంకులు విద్యార్థుల లక్ష్యాలకు ఆటంకం కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!