
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 11న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ కారణంగా తాను తీవ్ర అవమానానికి గురయ్యానని ఆరోపించారు. తనను బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపించారని పేర్కొంటూ, పార్టీని వీడాల్సి వచ్చిన పరిస్థితులపై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాజకీయ కుటుంబాల పాలన నుంచి కాపాడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా తమ పార్టీ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!