6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

Writer: Chandrika 04:14 PM, 6 నవంబర్, 2026
వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ మాజీ ప్రమోటర్‌, డైరెక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబయి బెంచ్‌ ప్రకటించింది. వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ, రుణాల చెల్లింపు ప్రణాళిక విఫలమవడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఈ నిర్ణయం తీసుకుంది. వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, వీడియోకాన్‌ టెలికమ్యూనికేషన్స్‌ వంటి గ్రూప్‌ సంస్థల కోసం ధూత్‌ వ్యక్తిగత హామీలు ఇవ్వడంతో, ఆయా రుణాల చెల్లింపుల్లో వైఫల్యంపై బ్యాంకులు 2018 ఫిబ్రవరిలోనే క్లెయిమ్‌లు దాఖలు చేశాయి.

వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా సిలిగురిలోని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు ద్వారా 36 నెలల్లో రూ.600 కోట్లు చెల్లిస్తానని ధూత్‌ ప్రతిపాదించారు. అయితే, ముందస్తు చెల్లింపు లేకపోవడం, భవిష్యత్తులో చెల్లింపులు జరుగుతాయన్న నమ్మకం లేకపోవడంతో రుణదాతలు ఆ ప్రణాళికను తిరస్కరించారు. దీంతో జులైలో గత పరిష్కార ప్రక్రియను ముగించి, పూర్తిస్థాయి దివాలా చర్యలకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తాజా ఉత్తర్వుల్లో భాగంగా ఆశిష్‌ నారాయణను దివాలా ట్రస్టీగా నియమించి, రుణదాతల నుంచి క్లెయిమ్‌లు స్వీకరించాలని, 90 రోజుల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తన ఆర్థిక వివరాలను సమర్పించేందుకు ధూత్‌కు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎస్‌బీఐ మొత్తం రూ.12,668 కోట్ల రుణాన్ని రికవరీ చేయాలని కోరుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

ట్యాగ్లు
వేణుగోపాల్‌ ధూత్‌వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ఎన్‌సీఎల్‌టీఎస్‌బీఐదివాలా ప్రక్రియదివాలా స్మృతివ్యక్తిగత దివాలారుణ ఎగవేతఆశిష్‌ నారాయణకార్పొరేట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?
జనరల్

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ కార్యకర్తలు
రాజకీయాలు

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..
జనరల్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..
బిజినెస్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
రాజకీయాలు

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు
జనరల్

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు
సినిమాలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..
జనరల్

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!