6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

Writer: Chandrika 04:46 PM, 6 నవంబర్, 2026
లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

సైబర్‌ భద్రతా సమస్యలను వేగంగా గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు అన్‌రిలీజ్డ్‌ ఏఐ మోడల్‌ ఆధారంగా ప్రత్యేక పైప్‌లైన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు OpenAI వెల్లడించింది. ఈ వ్యవస్థ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను గుర్తించడం, వాటిని పరీక్షించి నిర్ధారించడం, పరిష్కారాలను రూపొందించడం వంటి పనులను పెద్ద స్థాయిలో చేపట్టగలదు. సంస్థ అంతర్గత పరీక్షల ప్రకారం.. ఈ ప్రోటోటైప్‌ Linux కెర్నల్‌లో 2,308 అనుమానాస్పద భద్రతా సమస్యలను గుర్తించి విశ్లేషించింది. వాటిలో 1,724 లోపాలను పరీక్షల ద్వారా పునరుత్పత్తి చేయగలిగింది. అలాగే పరిమిత యాక్సెస్‌ ఉన్న స్థానిక వినియోగదారుడు అడ్మినిస్ట్రేటర్‌ స్థాయి అధికారాలను పొందేందుకు వీలుకల్పించే 948 లోకల్‌ ప్రివిలేజ్‌ ఎస్కలేషన్‌ (LPE) ఎక్స్‌ప్లాయిట్లను రూపొందించింది. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 12.13 లక్షల డాలర్ల ఏపీఐ క్రెడిట్లు ఖర్చయ్యాయని, ఒక్కో ఎక్స్‌ప్లాయిట్‌కు సగటున 1,279 డాలర్లు వ్యయమైనట్లు OpenAI తెలిపింది. ఈ ప్రక్రియలో తమ ఏఐ ఏజెంట్లు గతంలో తెలియని కనీసం 10 Linux ఎక్స్‌ప్లాయిటేషన్‌ పద్ధతులను గుర్తించి ఉపయోగించాయని పేర్కొంది.

గతంలో GPT-5.5-Cyber మోడల్‌ సాయంతో 2026 జూన్‌లో 24కు పైగా LPE ఎక్స్‌ప్లాయిట్లను గుర్తించిన OpenAI.. తాజా పరిశోధనలో మరింత పురోగతి సాధించింది. అక్టోబర్‌ మధ్యలో నిర్వహించిన పరీక్షలో 30 గంటల్లోనే 1,724 లోపాలను పునరుత్పత్తి చేసి, 291 సమాచార లీకేజీ సమస్యలకు ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ ఎక్స్‌ప్లాయిట్లతో పాటు 948 LPE ఎక్స్‌ప్లాయిట్లను రూపొందించినట్లు వెల్లడించింది. ఈ ఏఐ పైప్‌లైన్‌ ఐదు దశల్లో పనిచేస్తుంది. మొదట భద్రతా లోపాలను గుర్తించడం, ఆ తర్వాత సురక్షితమైన శాండ్‌బాక్స్‌ వాతావరణంలో వాటిని పరీక్షించడం, దుర్వినియోగం చేసే అవకాశాలను అంచనా వేయడం, పరిష్కారాలను రూపొందించడం, చివరగా నిపుణులతో వాటిని సమీక్షించడం జరుగుతుంది. మానవ నిపుణుల పరిశీలన తర్వాతే పరిష్కారాలను సంబంధిత సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ బృందాలకు పంపిస్తామని OpenAI తెలిపింది. సైబర్‌ దాడులను వేగవంతం చేసే సామర్థ్యం ఏఐకి ఉన్నప్పటికీ, భద్రతా లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దడంలోనూ అది కీలకంగా మారుతోందని ఈ పరిణామం సూచిస్తోంది. Google Threat Intelligence Group నివేదిక ప్రకారం.. 2026 జనవరిలో నెలకు 5,045గా ఉన్న భద్రతా లోపాల వెల్లడి ఆగస్టు నాటికి 10,740కి పెరిగింది. అధిక ప్రమాద స్థాయి లోపాల వెల్లడి కూడా 167 శాతం పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

యాపిల్ ఉద్యోగులకు షాక్.. ఏఐ వినియోగ బడ్జెట్‌లో భారీ కోత!

యాపిల్ ఉద్యోగులకు షాక్.. ఏఐ వినియోగ బడ్జెట్‌లో భారీ కోత!

భారత ఫిన్‌టెక్ సంస్థలపై ఏఐ సైబర్ దాడులు.. CERT-In తాజా హెచ్చరిక

భారత ఫిన్‌టెక్ సంస్థలపై ఏఐ సైబర్ దాడులు.. CERT-In తాజా హెచ్చరిక

అదుపు తప్పే ఏఐ ఏజెంట్లకు కిల్ స్విచ్.. క్రౌడ్‌స్ట్రైక్ కొత్త టూల్

అదుపు తప్పే ఏఐ ఏజెంట్లకు కిల్ స్విచ్.. క్రౌడ్‌స్ట్రైక్ కొత్త టూల్

ఏఐ పెట్టుబడుల వేళ ఖర్చుల నియంత్రణ.. గూగుల్ కీలక నిర్ణయం

ఏఐ పెట్టుబడుల వేళ ఖర్చుల నియంత్రణ.. గూగుల్ కీలక నిర్ణయం

యాప్స్‌కు బదులుగా ఏఐ ఏజెంట్లు.. ఐఫోన్‌కు పోటీగా ‘సైక్లోన్‌’ స్మార్ట్‌ఫోన్‌

యాప్స్‌కు బదులుగా ఏఐ ఏజెంట్లు.. ఐఫోన్‌కు పోటీగా ‘సైక్లోన్‌’ స్మార్ట్‌ఫోన్‌

ట్యాగ్లు
ఓపెన్‌ఏఐఏఐ సైబర్‌ భద్రతలినక్స్‌ భద్రతజీపీటీ-5.5 సైబర్‌భద్రతా లోపాలుఏఐ ఏజెంట్లుసైబర్‌ దాడులులోపాల గుర్తింపుసాఫ్ట్‌వేర్‌ ప్యాచింగ్‌టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..
టెక్నాలజీ

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా
జనరల్

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..
టెక్నాలజీ

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
జనరల్

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?
జనరల్

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ కార్యకర్తలు
రాజకీయాలు

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..
జనరల్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..
బిజినెస్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!