6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

Writer: Chandrika 04:05 PM, 6 నవంబర్, 2026
స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంపై నెలకొన్న ఆందోళనలు భారత మార్కెట్లకు అనుకూలంగా మారుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఏఐ పెట్టుబడులు తక్కువగా ఉన్నాయనే కారణంతో భారత మార్కెట్లకు దూరంగా ఉన్న మదుపర్లు.. ప్రస్తుతం ‘యాంటీ ఏఐ’ సెంటిమెంట్‌తో దేశీయ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ దాదాపు 1,100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 24,800 పాయింట్లకు చేరువైంది. సెన్సెక్స్‌ క్రితం ముగింపు 79,310.01 పాయింట్లతో పోలిస్తే ఉదయం 79,413.66 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. అనంతరం ర్యాలీ కొనసాగించి మధ్యాహ్నం 2 గంటల సమయానికి 1,095 పాయింట్ల లాభంతో 80,405 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 259 పాయింట్లు పెరిగి 24,795 వద్ద కొనసాగింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా షేర్లు భారీ లాభాలు నమోదు చేశాయి. మరోవైపు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బీఈఎల్‌, ఇండిగో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగాయి. మార్కెట్ల ర్యాలీకి ప్రధానంగా మూడు అంశాలు దోహదం చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం నేపథ్యంలో ఏఐ రంగంపై నిబంధనలు కఠినతరం కావచ్చన్న ఆందోళనలు, విదేశీ సంస్థాగత మదుపర్ల భారీ పెట్టుబడులు, కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు. గురువారం ఒక్కరోజే విదేశీ మదుపర్లు రూ.14,975 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత ఆరేళ్లలో ఒకే రోజులో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. ఇటీవలి పతనంతో ఆకర్షణీయ ధరలకు చేరిన లార్జ్‌క్యాప్‌ షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు ఊతమిచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

మధ్యంతర ఎన్నికల ర్యాలీ తర్వాత అమెరికా మార్కెట్లకు భారీ షాక్..

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

ట్యాగ్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌సెన్సెక్స్‌నిఫ్టీ 50స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీవిదేశీ సంస్థాగత మదుపర్లువిదేశీ పెట్టుబడులుకృత్రిమ మేధయాంటీ ఏఐ సెంటిమెంట్‌కంపెనీల త్రైమాసిక ఫలితాలులార్జ్‌క్యాప్‌ షేర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..
జనరల్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..
బిజినెస్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
రాజకీయాలు

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు
జనరల్

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు
సినిమాలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..
జనరల్

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లోకి వెళ్లడం నిజమేనా?
క్రీడలు

హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లోకి వెళ్లడం నిజమేనా?

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు
రాజకీయాలు

మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై హైకమాండ్‌కు పీసీసీ చీఫ్ ఫిర్యాదు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు
రాజకీయాలు

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!