

పెట్రోలియం, రిటైల్, టెలికాం, పవర్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా రక్షణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని రెండు సంస్థలు నిర్ణయించాయి.
ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లో ప్రత్యేక ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీలు ప్రణాళిక రూపొందించాయి. ఇంజిన్ల డిజైన్, తయారీ, పరీక్షలతో పాటు పవర్, ప్రొపల్షన్ టెక్నాలజీలో దేశీయ సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. రిలయన్స్ తయారీ సామర్థ్యం, రోల్స్ రాయిస్ ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని కలిపి బలమైన ఏరో ఇంజిన్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తామని అనంత్ అంబానీ తెలిపారు. ఈ ఒప్పందం ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి కీలకంగా మారుతుందని రెండు సంస్థలు పేర్కొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!