
గాసిప్స్

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనున్న జగన్నాథుడి రథయాత్ర కోసం 95 కిలోల భారీ వెండి రథాన్ని శిల్పులు అత్యంత నైపుణ్యంతో సిద్ధం చేస్తున్నారు. 58 విడిభాగాలతో రూపొందుతున్న ఈ రథం సుమారు 21 అడుగుల ఎత్తు, 17 అడుగుల పొడవుతో భక్తులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రతి భాగానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
రథయాత్రకు ఐదు రోజుల ముందు అన్ని విడిభాగాలను ఒకచోట చేర్చి నిపుణులైన శిల్పులు నిర్ణీత క్రమంలో రథాన్ని అమర్చనున్నారు. జులై 16న జరిగే జగన్నాథుడి ఊరేగింపును తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. రథయాత్ర అనంతరం రథాన్ని జాగ్రత్తగా విడదీసి భద్రపరుస్తారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!