

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం ఒక సంస్థ మాత్రమే కాకుండా ప్రపంచానికి భారత్ సామర్థ్యాన్ని చాటిచెప్పే శక్తిగా నిలుస్తోంది. గత పదేళ్లుగా చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య-ఎల్1 వంటి విజయవంతమైన ప్రయోగాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయాణం గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ఐదేళ్లుగా స్వదేశీ సాంకేతికతతో వివిధ దశలను పూర్తి చేస్తూ పలు ప్రయోగాత్మక పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో విశాఖపట్నం, గుజరాత్, తమిళనాడులో కీలక ముందస్తు పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు నుంచి క్రూ మాడ్యూల్‌ను శ్రీహరికోటకు తరలించారు. అక్టోబర్ మూడో వారంలో క్రూ ఎస్కేప్ సిస్టమ్‌కు సంబంధించిన కీలక పరీక్ష చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌లో ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. వ్యోమగాములను లో ఎర్త్ ఆర్బిట్‌లో ఏడు రోజులు ఉంచి సురక్షితంగా తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది. నాలుగు ట్రయల్ లాంచ్‌ల తర్వాత అసలు మాన్ మిషన్ నిర్వహించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!