
బిజినెస్

ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రభావవంతమైన స్టార్‌లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన అనంతరం వరల్డ్ కప్ క్వార్టర్‌ఫైనల్ టికెట్ల ధరలపై చర్చ మొదలైంది. పోర్చుగల్‌తో పాటు అమెరికా కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ ధరలు సుమారు 60 శాతం వరకు తగ్గినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గణాంకాలపై అధికారిక ధృవీకరణ లేదు.
రొనాల్డో లేని మ్యాచ్‌లపై అభిమానుల ఆసక్తి తగ్గిందని, ఆయన ప్రపంచవ్యాప్త అభిమాన బలం టికెట్ డిమాండ్‌పై ప్రభావం చూపిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. క్రీడా ప్రపంచంలో రొనాల్డో ప్రభావం కేవలం మైదానానికే పరిమితం కాకుండా వాణిజ్యపరంగానూ ఎంతో బలంగా ఉందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే టికెట్ ధరల తగ్గుదలకు సంబంధించి అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!