

అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు జరపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. దీంతో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 2.6 శాతం పెరిగి 76.1 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్‌పైనా కనిపించింది.
ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టంతో ప్రారంభమై, ఉదయం 9:30 గంటల నాటికి 592 పాయింట్లు కోల్పోయి 77,588 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 178 పాయింట్లు పడిపోయి 24,220 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.15గా నమోదైంది.
సెన్సెక్స్, నిఫ్టీలో కల్యాణ్ జువెల్లర్స్, ఇన్ఫోఎడ్జ్, జైడస్ లైఫ్, ఇండస్ టవర్స్, వొడాఫోన్ ఐడియా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, ఎంఫసిస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 391 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 225 పాయింట్లు పడిపోయాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!