
సినిమాలు

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జీఆర్‌టీ జువెలర్స్ 'స్వర్ణ ఆషాఢ' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు రూ.200 వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే వినియోగదారులకు గ్రాముకు అదనంగా రూ.150 వరకు ప్రయోజనం కల్పిస్తోంది.
డైమండ్, అన్‌కట్ డైమండ్ ఆభరణాల విలువపై 12.5 శాతం వరకు డిస్కౌంట్‌ను జీఆర్‌టీ ప్రకటించింది. అదనంగా వెండి వస్తువుల తయారీ చార్జీలపై (VA) 25 శాతం వరకు, వెండి ఆభరణాల ఎంఆర్‌పీపై 10 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్రత్యేక ఆఫర్లు దక్షిణ భారతదేశంలోని జీఆర్‌టీ జువెలర్స్‌కు చెందిన 68 షోరూమ్‌లతో పాటు సింగపూర్‌లోని షోరూమ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!