
జనరల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర మే తర్వాత తొలిసారి 100 డాలర్ల మార్క్ దాటి, బ్యారెల్‌కు 100.68 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ ధర కూడా 91.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణా మందగించింది. అదేవిధంగా ఎర్ర సముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హూతీలు దాడులు జరపడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ప్రభావంతో అమెరికా స్టాక్ మార్కెట్లు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్, ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ కాంపోజిట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!