
జనరల్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో సభా కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సభ్యులు ప్రశ్నలు అడిగి ప్రభుత్వాన్ని సమాధానాలు కోరనున్నారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, పని దినాలు ఎన్ని ఉండాలి, సభలో చేపట్టాల్సిన అంశాలు, అజెండా వంటి విషయాలపై బీఏసీ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నిర్ణయాల ఆధారంగా రానున్న రోజుల్లో అసెంబ్లీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!