

రూ.37,500 కోట్లతో అమలు చేస్తున్న కోల్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకానికి ఆదరణ లభించలేదంటూ వచ్చిన వార్తలను కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఖండించింది. ఈ పథకం కింద ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ఇప్పటికే తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ , ఎన్‌టీపీసీ నుంచి దరఖాస్తులు అందాయని వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుందని తెలిపింది.
దేశీయ బొగ్గును విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో వినియోగించడం, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. సుమారు రూ.2.5–3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు దాదాపు 50 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!