

కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ఒకవైపు ఉద్యోగాలపై ఆందోళనలు పెరుగుతుండగా.. మరోవైపు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, పెట్టుబడిదారుల సంపద వేగంగా పెరుగుతోంది. గ్లోబల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అల్ట్రాటా వెల్త్ రిపోర్ట్ ప్రకారం, గతేడాది ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య దాదాపు 3,800కు చేరింది. వీరి మొత్తం సంపద సుమారు 15.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏఐ రంగంలో సగటున 30 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు అధిక మార్కెట్ విలువను సాధించినట్లు పేర్కొంది.
ఏఐ ఆధారిత టెక్నాలజీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెరగడంతో బిలియనీర్ల సంపద 12.8 శాతం, వారి సంఖ్య 8.2 శాతం పెరిగినట్లు అల్ట్రాటా తెలిపింది. ప్రపంచ కుబేరుల మొత్తం సంపదలో 27 శాతం 50 బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన 29 మంది సూపర్ బిలియనీర్ల వద్దే ఉన్నట్లు వెల్లడించింది. ప్రాంతాల వారీగా ఉత్తర అమెరికాలో 1,337 మంది బిలియనీర్లు ఉండగా, ఐరోపాలో 1,081, ఆసియాలో 881 మంది ఉన్నారు. మొత్తం బిలియనీర్లలో మహిళల వాటా కేవలం 13 శాతమే కావడం గమనార్హం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!