

ఈ-కామర్స్ సంస్థల అనియంత్రిత విధానాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 నాటి వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలను ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) సవరణ నిబంధనలు, 2026’ పేరుతో సవరించింది. ధరల నిర్ణయం, స్పాన్సర్డ్ లిస్టింగ్‌లలో పారదర్శకత పెంచడంతో పాటు సెర్చ్ ఫలితాలను తారుమారు చేయడం, డార్క్ ప్యాటర్న్స్ వంటి అక్రమ విధానాలకు అడ్డుకట్ట వేయడమే ఈ సవరణల లక్ష్యమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.
సవరించిన ఈ-కామర్స్ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారుల హక్కులను కాపాడుతూ, ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. సులభతర వ్యాపారానికి ప్రోత్సాహం అందించడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడం సవరణల ప్రధాన ఉద్దేశంగా తెలిపింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!